22 April, 2026 | 6:05 PM

​ఎక్వాయిపల్లిలో అభివృద్ధి పనుల జోరు

22-04-2026 04:31 PM

* శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్ గౌడ్

ఎక్వాయిపల్లి,(విజయక్రాంతి): గ్రామ అభివృద్ధిలో భాగంగా  బుధవారం ఎక్వాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్ గౌడ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొని పనులను ప్రారంభించారు. గ్రామంలో ​నీటి ఎద్దడి నివారణకు చర్యలు ​వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రామస్తులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో DMFT నిధుల నుండి  రూ.2.00 లక్షల రూపాయలు మంజూరయ్యాయి.

ఈ నిధులతో ​నాగిరెడ్డి చెరువులో నూతన బోర్ మోటార్ ఏర్పాటు తో పాటు ​విద్యుత్ స్తంభాల అమరిక చేపట్టారు. ఈ పనులను పూర్తి చేసి, ఈరోజు సర్పంచ్ పంప్‌ను స్టార్ట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. ​నూతన అంగన్వాడీ భవనం ​మాధవనగర్ చెంచు కాలనీలో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.12 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన అంగన్వాడీ భవనానికి సర్పంచ్ శంకుస్థాపన చేశారు. త్వరలోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

అనంతరం​ అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు ​స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ సభలో సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ​ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ​విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు మరియు స్కిట్స్ గ్రామస్తులను, తల్లిదండ్రులను విశేషంగా అలరించాయి. ​"గ్రామ అభివృద్ధికి మరియు విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట వేస్తున్నాం. ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం."  సర్పంచ్ హామీనిచ్చారు.