అమ్మమ్మ.. సుశీలమ్మ
ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘సమ్మర్ హాలిడేస్’ అనే బాలల చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాల సమాహారంగా దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్ దేవ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్ధన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
త్వరలోనే ‘సమ్మర్ హాలిడేస్‘ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే, బుధవారం ఈ చిత్రం నుంచి స హజ నటి జయసుధ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశా రు. జయసుధ ఈ సినిమాలో అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో ఆకట్టుకోనున్నారు. ప్రేమానురాగాలు పంచే అమ్మమ్మ సుశీలమ్మ పాత్ర ప్రేక్షకుల మనసుకు హత్తుకోనుంది. ఈ చిత్రానికి డీవోపీ: సాయిప్రకాశ్; సంగీతం: సింజిత్ యెర్రమల్లి.






