29 May, 2026 | 8:25 PM

గవర్నర్‌కు ఘన స్వాగతం

29-05-2026 04:23 PM

పోలీసు గౌరవ వందనం స్వీకరణ

కుమ్రం భీం ఆసిఫాబాద్, 29(విజయక్రాంతి): రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విటల్ అధికారులు స్వాగతం తెలిపారు.అనంతరం గవర్నర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అధికారులతో స్వల్పంగా మాట్లాడి పర్యటన వివరాలను తెలుసుకున్నారు.