1 August, 2026 | 1:56 AM

రాంచందర్‌రావుకు ‘ఆటా’ ఘన స్వాగతం

01-08-2026 12:00 AM

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): అమెరికాలోని వాషింగ్టన్ డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాంచందర్‌రావును ‘ఆటా’ ప్రతినిధులు, బీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్‌లో జరిగే ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) 19వ మహాసభ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు శుక్రవారం అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో ప్రవాస తెలుగు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, యువ నాయకులు, భారతీయ ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై రాంచందర్ రావు చర్చించనున్నారు.