20 March, 2026 | 3:37 AM

జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబురాలు

20-03-2026 12:08 AM
  1. వేడుకల్లో పాల్గొన్న టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జయా చైతన్య రెడ్డి, భరత్ సాయు రెడ్డి

పేలాల లడ్డూ ప్రసాదం అందించిన జగ్గారెడ్డి

ఉగాది పండుగ సందర్భంగా ప్రతియేడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రామ్ మందిర్ లో ఉగాది వేడుకలు అంబరాన్ని అంటాయి. టీపిసిసి  వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రామ్ నగర్ రామ్ మందిర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. జగ్గారెడ్డి స్వయంగా  పాటలు పాడుతూ, భక్తి గీతాలు ఆలపిస్తూ భజన లో పాల్గొన్నారు. పేలాల లడ్డు ప్రసాదంతో  భజన కీర్తనలు పాడుతూ రామ్ నగర్ లో ఊరేగింపు నిర్వహించారు.

అనంతరం  రామ్ మందిర్ లో శ్రీ కృష్ణ భగవానుడి  ఉట్టి కొట్టడం నిర్వహించారు. అనంతరం  తరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం    రామ్ మందిర్ పై నుండి పేలాల లడ్డూ ప్రసాదాన్ని  భక్తుల పైకి విసిరేశారు. ఉగాది రోజు ఈ లడ్డూ ప్రసాదాన్ని  అందుకుంటే అదృష్టం వరిస్తుందని భక్తులకు నమ్మకం. ఈ ప్రసాదాన్ని అందుకోవడానికి వేలాది మంది భక్తులు రామ్ మందిర్ కు చేరుకుని ప్రసాదాన్ని అందుకోవడానికి పోటీలు పడ్డారు. ఈ కార్యక్రమంలో  టీజిఐఐసి నిర్మలా జగ్గారెడ్డితో పాటు జగ్గారెడ్డి కూతురు జయా చైతన్య రెడ్డి, కొడుకు భరత్ సాయి రెడ్డిలతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.