మెదక్ జిల్లాలో ఘనంగా పంచాంగ శ్రవణం
20-03-2026 12:10 AM
ఘనంగా ఉగాది వేడుకలు
మెదక్, మార్చి 19(విజయ క్రాంతి) :మెదక్ జిల్లాలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఆయా మండలాల్లోని ఆలయాల్లో పంచాంగ శ్రవ ణం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేం ద్రంలోనీ రామాలయంలో, వెంకటేశ్వర స్వామి ఆలయం లో, పాపన్న పెట్ ఏడు పా యల్లో, జిల్లాలోని ఆయా మండలంలోని దేవాలయాల్లో ఉగాది పండుగ పురస్కరించు కొని పంచాంగ శ్రవణం నిర్వహిం చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య శ్రీనివాస్ శర్మ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భాగంగా ఆదాయ వ్యయ విషయాలపై వివరించారు. నామ నక్షత్రం జన్మ నక్షత్రం ఆధారంగా పరాభవ నామ సంవత్సర కాలంలో జరగబోయే విశేషాలను ఆయన తెలిపారు.




