కోటా హటావో సంకటం
నివురుగప్పిన నిప్పులా ఎన్డీయే కూటమి
రిజర్వేషన్ హటావో ఆందోళన్’పై మిత్రపక్షాల ఫైర్
కోటాకు అనుకూలంగా ఇద్దరు కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వ పెద్దల మౌనం.. కూటమిలో అంతర్గత చర్చ షురూ
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఢిల్లీ వేదికగా ఇటీవల జరిగిన ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ ఎన్డీయే కూటమిలో తీవ్రమైన చర్చను లేవనెత్తింది. సమాజంలో అట్టడుగు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం రాజ్యంగం ద్వారా సంప్రాప్తించిన రిజర్వేషన్ల వ్యవస్థపై దేశంలో మళ్లీ వివాదం రాజుకుంది. కుల ఆధారిత కోటాలను రద్దు చేసి కేవలం ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
కోటా తొలగించాలనే ఆందోళనలపై ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే స్తున్నాయి. రాజ్యాంగపరమైన హక్కు అయిన రిజర్వేషన్లను వ్యతిరేకించడం సరికాదని మిత్రపక్షాల నేతలు నినదిస్తున్నారు. ఈ పరిణామాలు అధికారపక్షంలో అంతర్గత స్థిర త్వానికి సవాల్‌గా పరిణమించేలా కనిపిస్తున్నది.
మరో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
కేంద్ర ఆహార ప్రాసెసింగ్‌శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’పై ఓ రాజకీయ వేదికగా తీవ్రంగా స్పందించారు. రిజర్వేషన్లు సమాజంలో అట్టడుగు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. కోటా అనేది ఎవరో ఇచ్చే భిక్ష కాదని కుండబద్దలు కొట్టారు. సమాజంలో కుల వివక్ష ఇప్పట్లో అంతరించిపోదని, ఆ వివక్ష అంతరించిపో యే వరకు రిజర్వేషన్లు అవసరమని స్పష్టం చేశారు.
కుల వివక్షకు ఉదాహరణగా.. ఎస్సీ వర్గానికి చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల ఉత్తరాఖండ్‌లో పర్యటిం చిన స్థలాన్ని కొందరు కులోన్మాదులు చేశారనీ గుర్తుచేశారు. దళిత యువత కనీసం గుర్రపు స్వారీ చేస్తే కూడా అగ్రవర్ణాలు అడ్డుకుని, దాడి చేస్తున్న ఉదంతాలను ఆయన గుర్తుచేశారు. ఈయన వ్యాఖ్యలపై వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ స్పందించారు. రిజర్వేషన్లను దన్నుగా చేసుకుని ఆర్థికంగా బలంగా ఎదిగినవారు క్రీమీలేయర్ పరిధి కింద తమ కోటాను వదులుకోవాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దల మౌనం
రిజర్వేషన్ల హటావో ఆందోళన్, దాని ని వ్యతిరేకిస్తూ మిత్రపక్షాలకు చెందిన కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెద్దలు మౌనం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఆందోళనలు వారికి రాజకీయంగా మింగుడుపడటం లేదు. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకోవాల్సిన సమయంలో తాజా పరిణామాలు ఇబ్బ ందికరంగా పరిణమించాయి. ఓ వైపు మిత్రపక్షాలకు చెందిన దళిత నేతల ఆగ్రహం, మరోవైపు రిజర్వేషన్ వ్యతిరేక నిరసనలు సవాల్‌గా మారాయి. నిరసనకారుల ఆందోళనలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించడంపైనే ఎన్డీయే కూటమి రాజకీయ భవిష్య త్తు ఆధారపడి ఉందనేది విశ్లేషకుల అంచనా.
కేంద్ర మంత్రి అభ్యంతరం
కేంద్ర సామాజికన్యాయ శాఖ సహా య మంత్రి రాందాస్ అథవాలే రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వారిని దేశద్రోహు లని అభివర్ణించారు. రిజర్వేషన్లను వ్యతిరేకించడమంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకిం చడమేనని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అక్కడితో ఆగకుండా కోటాను వ్యతిరేకించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డి మాండ్ చేశారు. అయితే.. ఎస్సీ, ఎస్టీ, ఓబీ సీ వర్గాలతోపాటు అగ్రవర్ణాలకు పేదల కోసం కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించారు. ఈయన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అథావాలే) అనే పార్టీ అధినేత.






