1 May, 2026 | 3:36 AM

పదవ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం

01-05-2026 02:16 AM

వెంకటాపూర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటి ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన అంజలి (560), జయశ్రీ (556), శ్రీజ (553) లు అత్యుత్తమ మార్కులు సాధించి మండలానికి కీర్తి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంచి మార్కులు సాధించిన ఇతర విద్యార్థులను కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో రామప్ప ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఐలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధిక, ఆదర్శ పాఠశాల చైర్మన్ ఫరీనా బేగం, ఉపాధ్యాయులు బాబురావు, వేణు, మహేష్, అంబేద్కర్, కిషోర్, పిఆర్సీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.