1 May, 2026 | 3:38 AM

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహణ

01-05-2026 02:17 AM

పెబ్బేరు ఏప్రిల్ 30: మండల పరిధిలోని గుమ్మడం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో గురువారం చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు చిన్నారులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

చిన్నారులు రంగురంగుల దుస్తులు ధరించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్యాలతో అందరినీ అలరించారు. పిల్లల ప్రతిభను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసి, పాఠశాల విద్యకు సిద్ధమవుతున్నందుకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా అంగన్వాడి సిబ్బంది మాట్లాడుతూ, చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్లు భాగ్యలక్ష్మి, శాంతమ్మ పిల్లలు, తల్లులు పాల్గొన్నారు.