06-02-2026 05:45:18 PM
నంగునూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని గట్లమల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె. అంజలి రెడ్డి ఉన్నత విద్య నిమిత్తం వెళ్తున్న సందర్భంగా ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆధ్వర్యంలో వీడ్కోలు,సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ శివకుమార్, డాక్టర్ మంజుల, డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ.. అంజలి రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు అందించిన వైద్య సేవలను కొనియాడారు.
అనంతరం సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించి, ఉన్నత చదువుల్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇంగే నరేష్,ఉపసర్పంచ్ శ్రీనివాస్, సిహెచో, డిపిహెచో, సూపర్వైజర్లు, నర్సింగ్ సిబ్బంది, యుడీఎస్ &ఎల్డీసీ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొని ఆమెకు వీడ్కోలు పలికారు.