28 February, 2026 | 9:53 PM

గ్రామాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు

28-02-2026 01:51 AM

రూ.25 లక్షల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్ 

గుమ్మడిదల, ఫిబ్రవరి 27 :గ్రామాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ.. అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామ పరిధిలోని మొ ల్లగూడెం మండల ప్రాథమిక పాఠశాల లో 10 లక్షల రూపాయల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు, వీరారెడ్డి పల్లి నుండి ముళ్ళగూడెం వరకు 15 లక్షల రూపాయలతో చేపట్టనున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శుక్రవారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు.. సంక్షేమ పథకాల అమలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని తె లిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుర్గా నర్సింగరావు, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, ఎంపీడీవో శారద, సీనియర్ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.