5 May, 2026 | 1:47 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

“ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన

05-05-2026 12:18 PM

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారంనాడు “ITP Aero – India” ప్లాంటుకు భూమి పూజ  చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని హార్డ్‌వేర్ పార్క్ (మూడవ దశ)లో, 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.453 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఐటీపీ ఏరో ఇండియా విమాన సంస్థ ఇంజిన్లలో ఉపయోగించే దృఢమైన గొట్టాలకు (rigid tubes) అవసరమయ్యే ఎండ్-ఫిట్టింగ్‌లు, బ్రాకెట్ల వంటి కీలక భాగాలను తయారు చేస్తుంది. 

ప్రస్తుతం శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన ఈ కర్మాగారం, 2027 నాటికి పూర్తిస్థాయిలో కార్యకలాపాలను ప్రారంభించనుందని భావిస్తున్నారు. ఐటీపీ ఏరో ఇండియా ప్లాంటు ద్వారా 350 మంది నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉపాధిని కల్పించనుంది. రాబోయే సంవత్సరాల్లో ఈ ఉద్యోగుల సంఖ్య సుమారు 600కి విస్తరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అంచనా వేశారు.