5 May, 2026 | 1:52 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

05-05-2026 12:56 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎన్. మహేష్ పాల్గొని రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. యూరియాను సమతుల్యంగా, అవసరానికి అనుగుణంగా వాడాలని సూచించారు. అలాగే ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సన్నబియ్యం రకాలైన RNR 15048, KNM 1638, BPT 5204, WGL 44, HMT సోనా, జై శ్రీరామ్ వంటి వరి రకాల సాగు చేయాలని రైతులకు సూచించారు. పంటల విభిన్నీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్) వైపు దృష్టి సారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ, ఉపసర్పంచ్ భానుచందర్, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) తిరుపతి స్థానిక రైతులు పాల్గొన్నారు.