5 May, 2026 | 1:53 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!

05-05-2026 12:47 PM

హర్మూజ్ మీదుగా సురక్షిత నౌకాయానం.. అత్యంత కీలకం

యూఏఈపై దాడులు.. ముగ్గురు భారతీయులకు గాయాలు

యూఏఈపై దాడులను ఖండిస్తూ ప్రధాని మోదీ ట్వీట్

యూఏఈకి భారత్ సంఘీభావం

న్యూఢిల్లీ:  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)పై దాడులను ఖండిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) మంగళవారం మోదీ ట్వీట్  చేశారు. ఫుజైరాలోని ఒక ప్రధాన చమురు పారిశ్రామిక ప్రాంతంలో డ్రోన్ దాడి కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంలో భారతీయులు గాయపడిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ దాడిని ఇరాన్ పాల్పడిందని UAE ఆరోపించింది. 

యూఏఈపై దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడ్డారని ప్రధాని తెలిపారు. పౌరులు, మౌలిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని మోదీ హెచ్చరించారు. యూఏఈకి భారత్ సంఘీభావం తెలుపుతోందని నరేంద్ర మోదీ వెల్లడించారు. చర్యలు, దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ మద్దతిస్తుందన్నారు. హర్మూజ్ మీదుగా సురక్షిత నౌకయానం అత్యంత కీలకమని పేర్కొన్నారు. శాశ్వత ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, ప్రపంచ ఇంధన భద్రత అవశ్యకమని మోదీ స్పష్టం చేశారు.

"ముగ్గురు భారతీయ పౌరులు గాయపడటానికి కారణమైన యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. పౌరులను, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు. భారతదేశం యూఏఈకి గట్టి సంఘీభావం తెలుపుతుంది. చర్చలు, దౌత్యం ద్వారా అన్ని సమస్యల శాంతియుత పరిష్కారానికి తన మద్దతును పునరుద్ఘాటిస్తుంది. శాశ్వత ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, ప్రపంచ ఇంధన భద్రత కోసం హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన, నిరాటంకమైన నౌకాయానాన్ని నిర్ధారించడం అత్యంత కీలకం." అని ప్రధాని మోదీ X పోస్ట్‌లో(PM Modi tweet) పేర్కొన్నారు.