27 July, 2026 | 3:23 PM

జలసిరి పై గ్రామ సభ

27-07-2026 02:32 PM

చేగుంట జూలై 27,విజయక్రాంతి: చేగుంట మండలం పొలం పల్లి గ్రామం లొ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి అధ్యక్షతన, పంచాయతీ సెక్రటరీ వెంకటేషం ఆధ్వర్యంలో జలసిరి పై గ్రామసభ నిర్వహించరు. సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి మాట్లాడుతూ... వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలందరూ వ్యవసాయ భూమి వద్ద ఉన్న బోరు బావి వద్ద పంటకుంట ను ప్రతి రైతు ఏర్పాటు చేయాలనీ గ్రామంలో ప్రతి ఒక్కరూ తడి,పొడి చెత్తను, వేరుచేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్  లొ వెరు చేసి వెయ్యాలని అన్నారు.

గ్రామం లొ ప్రతిఒక్కరూ తమ ఇంటి వద్ద వర్షం నీటిని వృధా చేయకుండా  ఇంకుడు గుంత నిర్మించుకోని, భూగర్భ జలాలను పెంపొందించుకోవడానికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమం లొ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిస్వామి, పంచాయతీ సెక్రెటరీ వెంకటేష్ వార్డ్ సభ్యులు యాట మౌనిక,  సి,సి శంకర్. ఏఎన్ఎం  నాగమణి, సిఏ రోజా, ఆశా వర్కర్ లక్ష్మి, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్  శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కొండి మల్లేష్, పులిమామిడి రాజు బుల్లి మల్లేష్ యాట సత్యం  పాల్గొన్నారు.