మాజీ ఎమ్మెల్యే కోలుకోవాలని ప్రత్యేక పూజలు
జనగామ, (చిల్పూర్),జూలై27 (విజయక్రాంతి): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ మండల కేంద్రంలోని చిల్పూర్ దేవస్థానంలో బీఆర్ఎస్ జిల్లా యువ నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేసి,మాజీ ఎమ్మెల్యే పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ప్రార్థిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల అభిమానం పొందిన నాయకుడని,ఆయన త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఇల్లందుల సుదర్శన్, జనగామ యాదగిరి, రంగు హరీష్ గౌడ్,ఉప సర్పంచ్ సంతోష్, నారాగోని రాజు, గుంటి బీములు,తాళ్లపల్లి జగన్నదాం, నోముల మల్లారెడ్డి, క్రాంతి ఎడ్ల రాజేష్ ,ఇల్లందుల సారయ్య, రాజి రెడ్డి, హర్షా,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






