5 June, 2026 | 1:32 AM

ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసే..

05-06-2026 12:18 AM

ఎస్‌పీ నరసింహ

సూర్యాపేట, జూన్ 4 (విజయక్రాంతి): ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసేనని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని 1వ వార్డు కుడకుడ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రజలు, సమాజం అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. గ్రా మం, సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రజ ల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తె లుసుకుని త్వరితగతిన పరిష్కారం చూపడానికే గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవలు అందించడంలో అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని చెప్పారు.

ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల ధన, ప్రాణ రక్షణలో పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. స్థానిక సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు, ఆకతాయిల కదలికలపై సమాచారం అందించడంలో ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్లా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి, స్థానిక కౌన్సిలర్ బానోతు సైదులు,ఆరోగ్య కేంద్ర వైద్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ అధికారులు, స్థానిక ఎస్‌ఐ గ్రామస్తులు పాల్గొన్నారు.