14 July, 2026 | 4:46 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

అధికారుల సమన్వయంతో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతం

20-12-2025 12:00 AM

జగిత్యాల, డిసెంబర్19(విజయక్రాంతి): మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జగిత్యాల జి ల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్  ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సి బ్బందిని అభినందించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అధికారులు అందరు సమన్వయంతో పనిచేయ డం వల్లనే ఎన్నికలు సజావుగా నిర్వహించగలిగామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలింగ్ రోజు భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల నిబంధనల కచ్చితమైన అమలు ఎన్నికల విజయానికి దోహదపడ్డాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.