4 July, 2026 | 11:37 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలి

01-11-2025 12:00 AM

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

శివంపేట్,(విజయక్రాంతి): శుక్రవారం శివంపేట మండల కేంద్రంలోని ప్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎట్టిపరిస్థితుల్లో కూడా ఏ ఒక్క రైతు నష్ట పోకుండా దళారులను ఆశ్రయించకుండా చూడాలన్నారు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని అన్నారు. రైతులు తెచ్చిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు అందేలా చూడాలని సంబంధిత అధికారులను సూచించారు.