ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
25-04-2026 04:39 PM
మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కెల్లేడు గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ( ఐకెపి సెంటర్ ) గ్రామ సర్పంచ్ ఆడెపు రజిత, విజయ్ ఆధ్వర్యంలో, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాతంగి సహదేవ్, పంచాయతీ కార్యదర్శి తిరుమలేశ్, వార్డ్ సభ్యులు, రైతులు, మహిళలు, గ్రామస్తులు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






