14 March, 2026 | 1:30 PM

విద్యార్థులకు గ్రేడింగ్ పరీక్షలు

09-03-2026 04:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వాసవి విద్యాసంస్థల్లో తెలంగాణ జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. కరాటే శిక్షణ పొందిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వివిధ బెల్టులను పంపిణీ చేశారు. మొత్తం 80 మంది విద్యార్థులకు గ్రేడింగ్ పరీక్షలు పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరెస్పాండెన్స్ పోతారెడ్డి, ప్రిన్సిపల్ శైలజ, కరెంటు శిక్షకులు తేజేంద్ర సింగ్ సాయికిరణ్ పాల్గొన్నారు.