19 August, 2026 | 3:38 AM

సమస్యలు పరిష్కరించాలని జీపీ కార్మికుల ధర్నా

19-08-2026 12:35 AM

దామరచర్ల, ఆగస్టు 18: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు దామరచర్ల ఎంపీడీవో కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ బైరం దయానంద్ మాట్లాడుతూ మండలంలోని గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ, ఎలాంటి అంటూ వ్యాధులు రాకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ పంచాయతీ కార్మికులు సేవలందిస్తున్నారన్నారు.

అటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నా, పనికి భద్రత , కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్‌ఐ ,ప్రమాద బీమా లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ, అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచిన కార్మికులు శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. ఇలా అనేక సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. అనంతరం ఎంపిడిఓ కు విన తిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల గ్రామ పంచాయతీ అధ్యక్షులు వాడపల్లి శ్రీరాములు , కార్యదర్శులు జహీర్, సహాయ కార్యదర్శి సైదులు, ఉపాధ్యక్షులు నాగ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు