వరుణుడి కోసం 115 ఆలయాల్లో పూజలు
19-08-2026 12:35 AM
మహబూ బాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): వరుణుడి అరు ణ కోసం మహబూబాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న 115 ధూప దీప నైవేద్య దేవాలయాల్లో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు..
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చకుల సంఘం అధ్యక్షులు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ, గౌరవ అధ్యక్షులు కృష్ణమాచార్యులు, లక్ష్మీ నరసింహ ఆచార్యులు, చక్రధరాచార్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.






