19 August, 2026 | 1:24 AM

జిల్లాలో 62 శాతం లోటు వర్షపాతం..

19-08-2026 12:36 AM
  1. నీటి లభ్యతకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలి
  2. రైతుల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్న కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు, ఆగస్టు 18 (విజయ క్రాంతి): జిల్లాలో ఆగస్టు నెలలో 62 శాతం లోటు వర్షపాతం బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. నీటి లభ్యతకు అనుగుణంగా పం టల వైవిధ్యీకరణపై రైతులు దృష్టి సారించాలని, రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటలపై అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని, సమస్యల పరిష్కారంలో స్పష్టమైన పురోగతి ఉండాలని జిల్లా కలెక్టర్ బో ర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం నూతన కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో సంయుక్త సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, సాగునీటి లభ్యత, పంటల సాగు పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ స్వయంగా రైతులతో మా ట్లాడి ఆయా మండలాలు, గ్రామాల్లో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులు, సాగునీటి సమస్యలు, పంటల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రత్యామ్నాయ పంటలపై వా రి అభిప్రాయాలు, సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు.

రైతులు తెలిపిన ప్రతి అంశాన్ని అధికారులు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నందున రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖల అధికారులు ఒకే వేదికపై చర్చించడం ద్వారా క్షే్ర తస్థాయిలో ఉన్న సమస్యలకు సరైన పరిష్కా ర మార్గాలను గుర్తించవచ్చన్నారు. మే నెల నుంచే ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు పరిస్థితులపై రైతులకు రైతు వేదికలు, ప్ర చార మాధ్యమాల ద్వారా నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నీటి లభ్య తను అంచనా వేసుకోకుండా పంటలు సా గు చేసి రైతులు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.