ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
- గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్: రైతుల సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. పి ఎస్ ఎస్ ఆధ్వర్యంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన శనగ, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరు మల్లారెడ్డి, ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారుల చేతులు మోసపోవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు.
సిద్ధిపేట జిల్లా రైతుల సౌలభ్యం కోసం ప్రొద్దుతిరుగుడు మొక్కజొన్న, శనగ, పంటల కొనుగోలు ప్రారంభించారన్నారు. ప్రొద్దు తిరుగుడుకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 7,721, మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2,400, శనగ కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5,875 నిర్ణయించ బడిందన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటలను విక్రయించి లాభాలు పొందాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి జాన్ వెస్లీ, పిఎసిఎస్ సీఈవో బాలయ్య, కౌన్సిలర్లు సత్య లక్ష్మీ యాదగిరి, విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




