కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్
21-03-2026 05:42 PM
రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
ముస్లిం సోదరులకు కొత్వాల ఈద్ ముబారక్
పాల్వంచ,(విజయక్రాంతి): కుల మతాలకతీతంగా, మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులు అత్యంత వేడుకగా జరుపుకునే పండుగ రంజాన్ అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రంజాన్ పండుగ సందర్బంగా శనివారం పాల్వంచ పట్టణ పరిధి ఇందిరా కాలనీలోని ఈద్గా వద్ద ప్రార్ధనలు జరిపిన ముస్లిం సోదరులను ఆయన కలుసుకుని ఈద్ ముబారక్ తెలిపారు. ముస్లింలను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అన్నీ కులాల, మతాల అభిమతం ఒక్కటేననీ, తోటివారికి సహకారం అందిచడమే అన్నారు.




