12 March, 2026 | 1:13 PM

ఘనంగా ప్రారంభమైన గోవిందరాజు, రాయి పాపయ్య జాతర

12-03-2026 12:02 AM

గుండాల, మార్చి 11 (విజయక్రాంతి): మండల పరిధిలోని శెట్టిపల్లి గ్రామంలో సనప వంశీయుల ఇలవేల్పు గోవిందరాజు జాతర మరియు మండల కేంద్రంలో ఆదివాసీ నాయకపోడు కుల దైవం రాయి పాపయ్య - అనమాల కన్నయ్య జాతరలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ రెండు జాతరలను బుధ, గురు, శుక్రవారాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయా జాతర నిర్వాహకులు తెలిపారు.

సనప వంశీయుల గోవిందరాజు జాతరలో నేటి నుండి వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి రూ. 10,116 ను ముత్తాపురం సర్పంచ్ కల్తి రాధ, ద్వితీయ బహుమతి రూ. 5,116 ను లింగగూడెం సర్పంచ్ చింతా వెంకటేశ్వర్లు, తృతీయ బహుమతి రూ. 3,116 ను గడ్డం రమేష్(వెల్డింగ్ షాప్ గుండాల) లు అందించనున్నట్లు జాతర నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు జాతర నిర్వాహణ కమిటీని సంప్రదించాలని వారు కోరారు.