మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం
మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
ఇల్లందు టౌన్, మార్చి 11 (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మాజీ కౌన్సిలర్ తోట లలిత శారద ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ 25 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ మాసం మతసామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించేవారని, ప్రస్తుతం ఆ కార్యక్రమం నిలిచిపోయిందని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు సిలివేరు సత్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు మహమ్మద్ జబ్బార్, కౌన్సిలర్ పాబోలు స్వాతి, మాజీ కౌన్సిలర్ తార, పట్టణ నాయకులు పాబోలు కిరణ్, గిన్నారపు రాజేష్, సత్తాల హరికృష్ణ, చాంద్ పాషా, మీర్జాబేగ్, బిపిన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.




