13 July, 2026 | 4:35 PM

Breaking News

విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •  

‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?

07-05-2026 12:03 PM

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ 

‘విజయ్ అనే నేను’... విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ 

ముఖ్యాంశాలు

గవర్నర్‌తో విజయ్ భేటీ

ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

సీఎం ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం

అసెంబ్లీలో బలం నిరూపిస్తామన్న విజయ్

తమిళ రాజకీయాల్లో కీలక మలుపు

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్‌తో భేటీ అనంతరం విజయ్‌కు సీఎం ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైందన్న ప్రచారం జోరందుకుంది.

చెన్నై: తమిళనాడులో ప్రభుత్వం(Tamil Nadu Government) ఏర్పాటుకు సంబంధించి కొనసాగుతున్న రాజకీయ పరిణామాల నడుమ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను(Governor Rajendra Vishwanath Arlekar) కలిసేందుకు విజయ్ గురువారం మరోసారి చెన్నైలోని లోక్ భవన్‌కు వెళ్లారు. టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ తో భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే గవర్నర్ రాజేంద్రతో విజయ్ సమావేశం ముగిసింది.

గవర్నర్ ఆహ్వానం తర్వాత టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైనప్పటికీ, అసెంబ్లీలో మెజార్టీ నిరూపణ కీలకంగా మారింది. ఇప్పటికే పలు పార్టీల మద్దతు కూడగట్టేందుకు విజయ్ చర్చలు కొనసాగిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇలాంటి రాజకీయ పరిణామాలపై మరిన్ని విశ్లేషణల కోసం మా Politics Section VijayaKranthi పేజీని చూడండి.

ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ను గవర్నర్ ఆహ్వానించినట్లు సమాచారం. విజయ్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో లోక్ భవన్  నుంచి విజయ్ పార్టీ ఆఫీసుకు వెళ్లారు. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని విజయ్ గవర్నర్ కు సూచించారు. విజయ్ భేటీ తర్వాత గవర్నర్ ఆర్లేకర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసేందుకుమార్గం సుగమం అయింది.

తమిళనాడు ఎన్నికల పూర్తి ఫలితాల కోసం మా VijayaKranthi News Website హోమ్‌పేజీని సందర్శించండి.


FAQ'S:

1. విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారా?
అవును. ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

2. విజయ్ ఎప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు?
అధికారిక తేదీ ప్రకటించకపోయినా త్వరలోనే ప్రమాణ స్వీకారం జరిగే అవకాశముంది.

3. టీవీకేకు అసెంబ్లీలో పూర్తి మెజార్టీ ఉందా?
టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మెజార్టీ నిరూపణ ఇంకా కీలకంగా ఉంది.

4. గవర్నర్‌తో విజయ్ భేటీ ఎక్కడ జరిగింది?
చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో విజయ్ భేటీ అయ్యారు.