24-02-2026 12:00:00 AM
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
మహబూబాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): అణగారిన వర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం మహబూబాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పరిశీలన నిమిత్తం వచ్చిన ఆయన ఇల్లందు రోడ్డులోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్, పేద వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా వివిధ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. జిల్లాకు చేరుకున్న చైర్మన్ కు మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ అధికారులు శ్రీనివాసరావు, దేశీరామ్ నాయక్ తదితరులు స్వాగతం పలికారు. స్థానిక తహసిల్దార్ రాజేశ్వర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.