ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్‌కి పీహెచ్‌డీ పట్టా
28-08-2026 12:00 AM
ఆదిలాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి) : అదిలాబాద్ సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సీనియర్ లెక్చరర్ షాహేజామ ఫాతిమాకి యూజీసీచే గుర్తింపు పొందిన మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ భోపాల్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో టు డెవలప్ ఇన్నోవేటివ్ టెక్నిక్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ విభాగంలో పీహెచ్డీని పూర్తి చేశారు.
డాక్టర్ వై నితిన్ పాటిల్ ఆధ్వర్యంలో తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఇదే కళాశాలలో చదువుకొని సీనియర్ లెక్చరర్ గా విధులు నిర్వర్తిస్తున్న షాహేజమ ఫాతిమా, శివాజీ చౌక్ అదిలాబాద్ స్థానికం కావడంతో పలువురు అభినందించారు.






