8 March, 2026 | 2:32 AM

ఫీజులుం వద్దు

08-03-2026 12:50 AM

డొనేషన్లు, ఇతర పేర్లతో విద్యార్థుల నుంచి అదనంగా గుంజొద్దు

వాయిదా పద్ధతుల్లో ఫీజులు చెల్లింపులకు విద్యార్థులకు అవకాశం

ఉత్తర్వుల్లో ఇంజినీరింగ్ కాలేజీలకు సర్కారు ఆదేశం

నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలేనని హెచ్చరిక 

హైదరాబాద్, మార్చి 7(విజయక్రాంతి): ప్రైవేట్ కాలేజీల ఆగడాలకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ ఫీజులను తాజాగా ఖరారు చేస్తూనే ఫీజుల వసూళ్ల అంశంలో ఇంజినీరింగ్ కాలేజీలకు పలు నిబంధనలను విధించింది. ఇక మీదట తమ ఇష్టానుసారంగా ఫీజులను విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేసే విధానానికి స్వస్తి పలకాలని ఉత్తర్వుల్లో తెలిపింది.

కచ్చితంగా వీటిని పాటించాలని అందులో ఆదే ంచింది. డొనేషన్లు, ఇతర రకరకాల పేర్లతో ఫీజులను వసూలు చేయడమే కాకుండా కాలేజీ (ట్యూషన్) ఫీజును విద్యార్థుల నుంచి ఒకేసారి వసూలు చేయొద్దని తెలిపింది. బలవంతంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూ లు చేయకుండా కఠిన నిబంధనలు విధించింది. విద్యార్థులు తమ వీలును బట్టి వా యిదాల పద్ధతిలో చెల్లించేందుకు అవకాశం కల్పించింది.  

వారికి ఆప్షన్ ఇవ్వాలి

పైగా కొన్ని కాలేజీలు ట్యూషన్ పేరుతో పాటు డోనేషన్లంటూ రకరకాల ఫీజుల పేరుతో లక్షలు వసూలు చేస్తుంటారు. ఒకవైపు రూ.లక్షల్లో ఫీజులు దానికి అదనంగా మరింత ఫీజులను తల్లిదండ్రుల నుంచి గుంజే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మినహా ఏ పేరుతోనూ అదనంగా వసూలు చేయొద్దని నిబంధనలు విధించింది.

విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం వార్షిక ట్యూఫన్ ఫీజును మాత్రమే అది కూడా ఆ ఏడాదికే వసూలు చేసుకోవాలి. ఒకేసారి లేదా వాయిదా పద్ధతుల్లో వసూలు చేసుకునేలా విద్యార్థులకు ఆప్షన్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీన్ని ఎవ్వరూ అతిక్రమించిన ఆయా కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

ముందే నిండుతున్న సీట్లు

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని మొత్తం సీట్లలో 70శాతం సీట్లు కన్వీనర్ కోటాలో, 30శాతం సీట్లు మేనేజ్‌మెంట్ కోటా (బీకేటగిరీ)లో భర్తీ చేస్తారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాతే మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించాలి. సీట్ల కేటా యింపులో నిబంధనలు తప్పనిసరిగా కాలేజీలు పాటించాల్సి ఉంటుంది. కానీ అవేం పాటించకుండానే నోటిఫికేషన్ వెలువడకముందే బేరసారాలు చేసేస్తున్నారు.

డొనేషన్ల పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఉన్న ఫీజుకు అదనంగా రెండు మూడు రెట్లు ఫీజులను వసూలు చేసులు చేయడం పరిపాటిగా మారింది. చాలా వరకు కాలేజీలు నోటిఫికేషన్ విడుదలకు ముందే...ఇంటర్ విద్యార్థుల వివరాలను తెలుసుకొని సీట్ల గురించి బేరసారాలు చేస్తున్నారు. ముందస్తుగా అడ్వా న్స్‌గా కొంత డబ్బులు చెల్లిస్తే కావాల్సిన సీట్లను బ్లాక్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

అత్యధికంగా 1.83 లక్షలు, అత్యల్పంగా రూ.45 వేలు

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను ఖరారు చేసింది. ఈసారి అత్యధిక ఫీజు రూ.1.83 లక్షలు (సీబీఐటీలో) ఉండగా, అత్యల్పంగా రూ.45 వేలు ఉంది. రూ.45 వేలు ఫీజు 21కాలేజీల్లో ఉంది. టీఏఎఫ్‌ఆర్సీ సిఫారసులను ఆమోదిస్తూ 160 కాలేజీల ఇంజినీరింగ్ ఫీజులను ఖరారు చేస్తూ తాజాగా జీవోను జారీ చేసింది. గత బ్లాక్ పిరియడ్‌లో రూ.లక్ష దాటిన కాలేజీల సంఖ్య 33ఉంటే, ఈసారి కూడా అంతే ఉన్నాయి. 70 కాలేజీలకు ఫీజులు పెంచలేదు. అలాగే బీఫార్మసీలో అత్యధిక ఫీజు రూ.1.21 లక్షలు కాగా, కనిష్ఠ ఫీజు రూ.45 వేలుగా ఉంది. గతంలో గరిష్ఠ ఫీజు రూ. 1.10 లక్షలుగా ఉంటే ఈసారికి రూ.11 వేలు పెరిగింది. ఫార్మ్ కనిష్ఠ ఫీజు రూ.68 వేలు, గరిష్ఠ ఫీజు రూ.1,37,500 కాగా, బీ.ఆర్క్‌టెక్చర్ కనిష్ఠ ఫీజు రూ.77వేలు, గిరష్ఠ ఫీజు రూ.1.32 లక్షలుగా ప్రభుత్వ ఖారురు చేసింది.