31 August, 2026 | 2:47 AM

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

31-08-2026 01:51 AM

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30 (విజయక్రా ంతి): పల్లెల వికాసమే ధ్యేయంగా ప్రభుత్వం నిధుల కేటాయింపులో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. శనివారం మంచాల మండలంలో పర్యటించిన ఆయ న, రూ. 2.07 కోట్ల వ్యయంతో పలు గ్రామా ల్లో చేపట్టిన సీసీ రోడ్లు, నూతన గ్రామ పం చాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎల్లమ్మతండాలోని వీరాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ, పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.