31 August, 2026 | 2:47 AM

వారాంతపు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో -ద్విచక్ర వాహనదారులే అధికం..

31-08-2026 01:49 AM
  1. 8 మందికి ప్రమాదకర స్థాయి ఆల్కహాల్ 
  2. ప్రాణాంతక ప్రమాదం జరిగితే పదేళ్ల జైలు: ఏడీసీపీ నరేందర్ 

శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (విజయక్రాం తి): నగరంలో వీకెండ్ వచ్చిందంటే చాలు మద్యం తాగి వాహనాలు నడిపే వారి సం ఖ్య పెరుగుతోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఏకంగా 182 మంది మం దుబాబులు దొరికిపోయారు. ఈ విషయా న్ని సైబరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డిసిపి జి. నరేందర్ వెల్లడించారు.పట్టుబడిన వారిలో 154 మంది ద్విచక్ర వాహనాలు నడుపుతుండగా, 20 మంది కార్లు, 7 మంది ఆటోలు,

ఒకరు భారీ వాహనం నడుపుతూ పోలీసుల వలలో పడ్డారు. రక్తంలో ఆల్కహాల్ మో తాదు పరీక్షల్లో 149 మందికి 36 నుంచి 20 0 ఎంజీ, 25 మందికి 201 నుంచి 300 ఎం జీ నమోదైంది. మరో 8 మందిలో 301 ను ంచి 550 ఎంజీ వరకు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఆల్కహాల్ కనిపించింది.నిందితులందరినీ న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు ఏడీసీపీ నరేందర్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ నేరానికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.ఇక గత వారం ఆగస్టు 24 నుంచి 29 వరకు కోర్టులు 308 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిష్కరించాయి. వీరిలో 7 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ శిక్ష పడగా, మిగిలిన 301 మందికి కేవలం జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.