14 August, 2026 | 4:11 AM

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

14-08-2026 01:18 AM

సర్పంచ్ జువ్వి నర్సింహ్మ 

చౌటుప్పల్, ఆగస్ట్ 13: విద్యాభివృద్ధికి సంక్షేమ పథకాలు అందజేయడంలో ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం మండల పరిషత్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఏపీఎం యాదయ్యతో కలిసి ఏకరూప దుస్తులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జువ్వి నర్సింహ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు, మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. 

ఏకరూప దుస్తులతో పాటు ఉచితంగా పుస్తకాల పంపిణీ చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఉదయం విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు సైతం సిద్ధం చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పకీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు సామిడి సంధ్య, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, జంగం వెంకటమ్మ, సిసి మామిళ్ళ నర్సింహ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గూడురు సునీత, వివోఏ సంతోష, మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.