కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు
బోథ్,మే26,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress leaders) ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం సరైంది కాదని బిజెపి జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి.
మన రాష్ట్రంలో ఏ విధంగా ఉందో తెలుసుకొని మాట్లాడాలని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ప్రధాని పనితీరును మెచ్చుకుంటుంటే ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులకు కళ్ళు లేవేమో అన్నారు..ప్రధాని దిష్టిబొమ్మను. దగ్ధం చేసే అర్హత వారికి లేదన్నారు.ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక సీఐ గురుస్వామికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ బోరే రవీందర్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటి పెళ్లి రాజు రైల్వే బోర్డు మాజీ సభ్యులు జీవీ రమణ తో పాటు పలు గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు






