ఖానాపూర్ పట్టణంలో స్వర్ణకార సంఘం కార్యవర్గం ఏర్పాటు
24-07-2026 09:07 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం స్వర్ణకార సంఘం కార్యవర్గం నూతనంగా ఏర్పాటు అయింది. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆ సంఘం నూతన అధ్యక్షుడిగా బిక్కునూరి రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా తుమ్మనపల్లి లక్ష్మణ్ లను ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల నిర్వాహకులుగా వ్యవహరించిన సింహరాజుల బ్రహ్మం, జిల్లా, రాష్ట్ర నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులను సభ్యులు సన్మానించారు.






