24 July, 2026 | 9:53 PM

వైభవంగా శ్రీజగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం

24-07-2026 09:04 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ డివిజన్ లో శుక్రవారం శ్రీజగన్నాథస్వామి రథయాత్రను వైభవంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి  ఆధ్వర్యంలో ఎన్‌ఎఫ్‌సీ నగర్ నుంచి శివారెడ్డి గూడ హనుమాన్ దేవాలయం వరకు  నిర్వహించిన శ్రీజగన్నాథ రథయాత్ర మహోత్సవంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీజగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్ర అమ్మవార్ల రథయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి హరినామ సంకీర్తనలో పాల్గొని రథయాత్ర విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.