25 April, 2026 | 7:47 PM

ఆర్టీసీ చరిత్రలో సువర్ణ అధ్యాయం

25-04-2026 06:17 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించి, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 11% పీఆర్సీ ప్రకటించడంతో పాటు వారి అన్ని డిమాండ్లను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం చారిత్రాత్మక ఘట్టం అని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం , రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ  కొనియాడారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ ని హైదరాబాద్ లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా కలిసి శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కి,  జిల్లా కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని నేతలు అన్నారు.