ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించండి
అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓకు కాంగ్రెస్ నేతల వినతి
గుండాల,(విజయక్రాంతి): గుండాల మండలంలో నెలకొన్న వైద్య సమస్యలపై శనివారం గుండాల పీహెచ్సీ నీ సందర్శించడానికి వచ్చిన అడిషనల్ కమిషనర్, డిఎంహెచ్ఓకి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పొంబోయిన ముత్తయ్య నాయకత్వంలో మండల నాయకులు పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా గుండాల మండల పరిధిలో సుమారు 14000 మంది జనాభా ఆదివాసి, గిరిజన, గిరిజన పేద ప్రజలు జీవిస్తున్నారు.
ఇంత జనాభా ఉన్నా మండలానికి పోస్టు మర్డర్ మార్చురీ లేకపోవడంతో 70 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని, వ గుండాల మండల కేంద్రానికి పోస్టుమార్టం మార్చురీ నిర్మాణం చేయాలని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా గుండాల పిహెచ్సి పరిధిలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని, 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని వినతి పత్రాలు అందజేశారు. వినతి పత్రాలు అందుకున్న డిఎంహెచ్ఓ అడిషనల్ కమిషనర్ స్పందిస్తూ త్వరలోనే వీటిని నిర్మాణాలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.






