25 April, 2026 | 8:06 PM

40 బస్తాల నల్లబెల్లం, రెండు బస్తాల పటిక పట్టివేత

25-04-2026 06:42 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల నల్ల బెల్లం, రెండు బస్తాల పటిక, 10  లీటర్ల గుడుంబాను పట్టుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ ఐ చిర్రా రమేష్ బాబు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పార్వతమ్మ గూడెం గ్రామ క్రాస్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ చేస్తూ వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక్క అశోక్ లే లాండ్ ట్రాలీ, పాసెంజర్ ఆటోల్లో 40 బస్తాల్లో ఉన్న రూ.2 లక్షల 14  వేల విలువ గల 20  క్వింటాళ్ల   నల్లబెల్లం, రెండు బస్తాల్లో ఉన్న 100 కేజీల పటిక, 10  లీటర్ల నాటు సారాయి స్వాదినం పట్టుబడ్డట్లు ఎస్ ఐ తెలిపారు.

అందులో ఉన్న వ్యక్తులను పట్టుకొని వివరాలు తెలుసుకోగా జాటొత్ విశాల్, జాటొత్ సునీల్, వాంకుడోత్ గణేష్, మహమ్మద్ అమీర్ అనే వీరు నలుగురు కర్ణాటక రాష్టం, బీదర్ నుండి నల్లబెల్లం, పటిక తెచ్చి, వాటితో గుడుంబా తయారు చేసి, వాటిని నెల్లికుదూర్ మండలం లోని చుట్టుప్రక్కల  తండాలలో అమ్మడానికి వెల్లుతుండగా, వారిని పట్టుకొని వారి పై  కేసు నమోదు చేసి అశోక్ లే లాండ్ ట్రాలీ, పాసెంజర్ ఆటోను, అందులో ఉన్న 20 క్వింటాళ్ల నల్లబెల్లం, 100 కేజీల పటిక, 10  లీటర్ల గుడుంబా స్వాదినం తీసుకొని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని మరో వ్యక్తి పారిపోయాడని ఎస్ ఐ తెలిపారు.