హైదరాబాద్: ఫిబ్రవరి 1న బడ్జెట్ 2025 ప్రవేశపెట్టనున్నారు. అయితే.. అంతకంటే ముందు బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. గగురువారం కూడా పసిడి ధర పెరుగుదల దిశగా అడుగులు వేసింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దు టూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్ఢ్ రేటు రూ. 76,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 83,020 వద్ద నిలిచాయి. నిన్న రూ. 850, రూ. 920 పెరిగిన బంగారం రేటు.. ఈ రోజు వరుసగా రూ. 150 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 170 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది.
చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 150, రూ. 170 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 76,100 వద్ద, 24 క్యారెట్ల గోల్ ధర రూ. 83,020 వద్ద ఉంది. దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 76,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 83,170 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి.
రూ.2 వేలు పెరిగిన వెండి
నిన్న రూ. 1,04,000 వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఈ రోజు రూ. 1,06,000లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి కంటే ఈ రోజు ధర రూ. 2000 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 98,500 వద్ద ఉంది.