31-01-2025 01:27:53 AM
ముంబై: అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభంలో భారీ క్షీణత నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1888 కోట్లుగా ఉన్న లాభం.. ఈ ఏడాది 97 శాతం క్షీణించి కేవలం రూ.58 కోట్లుగా నమోదైంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆదాయం సైతం 9 శాతం క్షీణించి రూ.22,848 కోట్లుగా నమోదైంది. గత త్రైమాసికంలో రూ.1742 కోట్లుగా ఉన్న నికర లాభం 97 శాతం మేర క్షీణించడం గమనార్హం. త్రైమాసిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 4 శాతం మేర క్షీణించాయి. చివరికి 3 శాతం నష్టంతో రూ.2,247.90 వద్ద ముగిశాయి.