9 August, 2026 | 4:07 AM

తెలంగాణ స్విమ్మర్ శివానికి స్వర్ణం

09-08-2026 12:00 AM
  1. సబ్ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్స్‌లో పతకం
  2. కోచ్ ఆయుశ్ యాదవ్ ఆధ్వర్యంలో శిక్షణ

జైపూర్, ఆగస్టు 8 :జాతీయ స్థాయి స్వి మ్మింగ్ పోటీల్లో తెలంగాణకు చెందిన శివా ని కర్రా అదరగొట్టింది. జైపూర్ వేదికగా జరుగుతున్న 42వ సబ్‌జూనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించిం ది. 400 మీటర్ల ఫ్రై స్టుల్ ఈవెంట్‌లో అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటింది. ఈ రేసును శివాని 4 నిమిషాల 38.47 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం కైవసం చేసుకుంది. కే రళకు చెందిన మెమోన్ రెండో స్థానంలో నూ, కర్ణాటక స్విమ్మర్ ఇదికా భట్ మూడో స్థానంలోనూ నిలిచారు.

కొంతకాలంగా జూ నియర్ స్థాయి పోటీల్లో శివాని అద్భుత ప్రతి భ కనబరుస్తోంది. గచ్చిబౌలీ స్టేడియం శాట్స్ హెడ్ కోచ్‌గా ఉన్న ఆయుశ్ యాదవ్ దగ్గర ఆమె శిక్షణ తీసుకుంటోంది. తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు టోర్నీలకు వెళ్లి పతకాలు గెలిచింది. ప్ర స్తుత సబ్ జూనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల బ్యాక్‌స్టోక్‌లోనూ ఆమె రజతం సాధించింది. జాతీయ స్థాయిలో మెరిసిన శివానికి, కోచ్ ఆయుశ్ యాదవ్‌కు శాట్స్ అధికారులు, స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.