మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత
రోసారియో, ఆగస్టు 8 : ప్రపంచ ఫుట్‌బా ల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెస్సీ తండ్రి జార్డ్ మెస్సీ కన్నుమూశారు. 68 ఏళ్ల జార్జ్ మెస్సీ కొంతకా లంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అర్జెంటీనాలోని రోసారియో నగరంలోని హాస్పిటల్‌లో చికిత్స పొందు తూ తుది శ్వాస విడిచారు. మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ ఎదగడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
చిన్నతనంలో మెస్సీ అర్జెంటీనా నుంచి బార్సిలోనాకు మా రినప్పటి నుంచీ ప్రొఫెషనల్ కెరీర్, కాంట్రాక్టులు, ఆర్థిక విషయాలు ఆయనే చూసుకుం టున్నారు. ఇటీవల తన తండ్రి అనారోగ్య పరిస్థితిపై మెస్సీ తీవ్ర భావోద్వానికి గురయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకుంటార నుకుంటుండగా ఇలా కన్నుమూయడంతో అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మెస్సీ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.






