9 August, 2026 | 2:53 AM

అర్జున్ సంచలనం

09-08-2026 12:00 AM
  1. వరల్డ్ ర్యాంకింగ్స్ టాప్ 100లో చోటు
  2. 9 నెలల్లో ఐదు మేజర్ టైటిల్స్

హైదరాబాద్, ఆగస్టు 8 : భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో మరో జోడీ దూ సుకొస్తోంది. హైదరాబాద్‌కు చెందిన అర్జున్ రెడ్డి పోచన, అచ్యుతాదిత్య రావు దొడ్డవరపు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో చోటు దక్కించుకున్నారు. గత 9 నెలల్లో ఏకంగా ఐదు మేజర్ టైటిల్స్ గెలవడంతో వీరి ర్యాంకింగ్ గణనీయంగా మెరు గైంది. 44 ఏళ్ల అర్జున్ రెడ్డి, 24 ఏళ్ల అచ్యుతాదిత్య గత ఏడాది అక్టోబర్‌లో డబుల్స్ జోడీగా జత కట్టారు.

ఈ 9 నెలల కాలంలో 12 అంతర్జాతీయ టోర్నీల్లో ఐదు మెడల్స్ గెలిచి సంచలనం సృష్టించారు. మెక్సికో ఇం టర్నేషనల్ సిరీస్‌లో స్వర్ణం, జాంబియా ఇం టర్నేషనల్ సిరీస్‌లో రజతం, ట్రినిడాడ్ అం డ్ టొబాగో ఓపెన్‌లో రజతం, సౌతాఫ్రికా ఇంటర్నేషనల్ టోర్నీలో కాంస్యం, పెరు ఇంటర్నేషనల్ టోర్నీలో రజతం గెలిచారు. ఇటీవల కొరియా మాస్టర్స్‌లోనూ రాణించడంతో తాజా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 100లోకి దూసుకొచ్చారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ భారత జోడీ చెబుతోంది. ఈ సందర్భంగా ఏ జోన్ ఎలైట్ బ్యాడ్మింటన్ అకాడమీ వీరిద్దరినీ ఘనంగా సత్కరించింది.