14 July, 2026 | 3:29 AM

గిరిజన విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఐటీడీఏ లక్ష్యం

13-07-2026 10:04 PM

 ఉట్నూర్,(విజయక్రాంతి): గిరి శిక్షణ సహాయం కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాలకు చెందిన పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఐఐటీ-జేఈఈ కోచింగ్ అందిస్తున్నామని ఐ టి డి ఏ పి ఓ  మంద మకరందు  అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని మాడ్యులస్ కాలేజీ సహకారంతో గత విద్యా సంవత్సరంలో 15 మంది గిరిజన విద్యార్థులను ఐఐటీ-జేఈఈ కోచింగ్‌లో చేర్పించగా, ఈ విద్యా సంవత్సరంలో కూడా మరో 15 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. మాడ్యులస్ అకాడమీ ఐఐటీ-జేఈఈ శిక్షణలో ప్రత్యేక నైపుణ్యంతో పని చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం అవుట్డోర్ ఐటిడిఏ పీ ఓ మందా మకరందు,  మాడ్యులస్ కాలేజీని సందర్శించి, విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. వారి విద్యాభ్యాసం, కోచింగ్ పురోగతి, వసతి, భోజనం తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. అదేవిధంగా విద్యార్థులు ఐఐటీ-జేఈఈ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలని ఆకాంక్షిస్తూ, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదవాలని సూచించారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి ఐటీడీఏ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రాజెక్టు అధికారి హామీ ఇచ్చారు.