రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో జిల్లా పోలీసుల ప్రతిభ
సిద్దిపేట క్రైం: పోలీస్ విధుల్లో నిరంతరం బిజీగా ఉంటూనే, రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో పతకాలు సాధించడం అభినందనీయమని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. ఈ నెల 7 నుంచి 9 వరకు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ లో జరిగిన అయిదో తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ముగిసింది. ఈ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఆమె అభినందించారు. పి. రోహిత్ (పవర్‌లిఫ్టింగ్), ఎ. అంజయ్య(కరాటే) బంగారు పతకాలు, ఎన్. అనిల్ కుమార్ (కరాటే), ఎ. భరత్(టైక్వాండో), డి. శ్రావణి (యోగా) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. భవిష్యత్ లో వారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సీపీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ(ఏఆర్) సుభాష్ చంద్రబోస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ విష్ణుప్రసాద్ పాల్గొన్నారు.






