8 August, 2026 | 3:30 AM

భానూరులోని బీడీఎల్‌ను సందర్శించిన గీతం విద్యార్థులు

08-08-2026 12:14 AM

క్షిపణి సాంకేతికపై ప్రత్యక్ష అవగాహన

పటాన్‌చెరు, ఆగస్టు 7 (విజయక్రాంతి) : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, డైనమిక్స్ లిమిటెడ్ ను లోని కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ (ఏఐడీఎస్) విభాగాల విద్యార్థులు, భారతదేశంలోని ప్రముఖ రక్షణ ఉత్పాదక సంస్థలలో ఒకటైన భానూరులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)ను సందర్శించి, భారతదేశపు అధునాతన క్షిపణి సాంకేతికతపై ప్రత్యక్ష అవగాహనతో పాటు విలువైన పారిశ్రామిక అనుభవాన్ని పొందారు.

ఈ పర్యటన సందర్భంగా, విద్యార్థులు ఆధునిక క్షిపణి సాంకేతికతలపై ఒక విజ్జానదాయక సదస్సులో పాల్గొన్నారు. అలాగే వారికి మిలన్, కొంకుర్స్, ఇన్వర్, కొంకుర్స్-ఎం వంటి ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి వ్యవస్థల గురించి బీడీఎల్ అధికారులు పరిచయం చేశారు. అంతే కాకుండా, ఆస్ట్రా గగనతల క్షిపణి, దానిని ఎస్.యూ-30, మిరాజ్ యుద్ధ విమానాలలో అనుసంధానించడం గురించి తెలుసుకునే అవకాశం కూడా వారికి లభించింది. గీతం విద్యార్థి బృందం బీడీఎల్ లోని ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాన్ని పర్యటించి, అక్కడ అత్యంత కచ్చితత్వంతో కూడిన సీ.ఎన్.సీ. మెషిన్లు, కీలకమైన క్షిపణి భాగాల ఉత్పత్తిని ప్రత్యక్షంగా పరిశీలించారు.