20 May, 2026 | 2:46 AM

ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి

20-05-2026 12:25 AM

రాజాపూర్ మే 19: బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి గ్రామానికి చెందిన ఆకాంక్ష అనే బాలిక ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్త్స్ర రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు వ్యవ సాయ వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట కోస్తుండగా అతని కూతురు ఆకాంక్ష పక్క పొ లం ఆమె పెద్దనాన్న ఆనంద్ రెడ్డి పొలంలో పొలంలో ఉన్న ట్రాక్టర్ వెనుక భాగంలో నీడలో కూర్చుంది.

అది గమనించని ఆనంద్ రెడ్డి ట్రాక్టర్ తీయగా బాలిక ట్రాక్టర్ చక్రాల కింద పడి రక్త గాయాలైనాయి. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం షాద్నగర్ ప్రభుత్వ దావకానకు తరలించారు. అక్కడ వైద్యుల పరిశీలించి బాలిక మృతి చెందినట్లు తెలిపారు. బాలిక మృతికి కారణమైన ఆనంద్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని బాలికతల్లి రత్నమేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.